గుర్తుతెలియని వాహనం ఢీ, ఆర్మూర్ లో ఘోర ప్రమాదం లో చోటు చేసుకుంది.చిట్టాపూర్- శ్రీరాంపూర్ గ్రామాల మధ్యలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే ఆర్మూర్ మండలం చిట్టాపూర్ శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.అతివేగంతో బైకును భారీ వాహనం ఢీకొట్టడంతో యువకుని మృతదేహం రెండు ముక్కలుగా అక్కడక్కడ పడిపోయింది.మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
