ఎట్టకేలకు మజ్లీస్ స్నేహ హస్తం ……గులాబీ పార్టీకి గుడ్ బై ………దారుస్సలాం నుంచి ఆదేశాలు …నిజామాబాద్ లో జీవన్ రెడ్డి కి మద్దతు @@@ మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎట్టకేలకు రాజకీయ సందిగ్దతకు తెరదించింది. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలనే నిర్ణయానికి వచ్చేసింది.
ఈ మేరకు దారుస్సలాం నుంచి ఆదేశాలు వచ్చేశాయి. నిజామాబాద్ లోకసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మద్దతు ఇస్తున్నట్లు యంఐయం నేతలు శనివారం ప్రకటించాయి. బైంసా మున్సిపల్ ఛైర్మెన్ జబ్బార్ నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్ ,షకీల్ లు అధికారికంగా ప్రకటించారు.
పోలింగ్ కు సరిగ్గా వారం రోజుల ముందు యంఐయం వైఖరి ని ఖరారు చేసింది. మొత్తానికి పదేళ్ల పాటు గులాబీ పార్టీ తో దోస్తానికి తెగతెంపులు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో బిఆర్ యస్ పార్టీకి మద్దతు పలికింది.
కానీ ముస్లిం వోటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.మరో వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మజ్లీస్ పార్టీ పునరాలోచనలో పడింది. చివరికి స్నేహాస్తం అందించింది.
