.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్ లో నివాసం ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ను సోమవారం ఆర్టీసీ మాజీ ఛైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు.
ఇటీవల గడుగు గంగాధర్ నివాసం ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించిన కారణంగా ఆస్తినష్టం జరిగి ప్రాణాపాయం నుంచి కుటుంబసభ్యులు బయట పడ్డారు. ఈ నేపథ్యంలో బాజిరెడ్డి ఆయనను, కుటుంబ సభ్యులను కలిసి అగ్నిప్రమాద సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రమాద సంఘటనల వల్ల ఇంటికి వాటిల్లిన నష్టాన్ని ఆయన పరిశీలించారు. దేవుడి దయవలన అదృష్టం బాగుండడం మూలంగా ఎలాంటి ప్రాణహాని జరగకపోవడం శుభపరిణామం అని బాజిరెడ్డి పేర్కొన్నారు.
బాజిరెడ్డి వెంట రూరల్ మండల బీ ఆర్ ఎస్ నాయకులు మీసాల మధుకర్ రావు, అన్నం సాయిలు, బానోత్ గోపాల్ నాయక్ తదితరులు ఉన్నారు.
