మాజి ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
అనంతరం రైల్వే స్టేషన్లో, స్నేహ సొసైటీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు…టిఆర్ఎస్ నాయకులు విట్టల్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కులో మతిన్ ఇమ్రాన్ సనాహుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు గాండ్ల లింగం, నర్సింగరావు, సుదం రవిచందర్ ల ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేశారు..
యువజన విభాగంనేత డీలోడ్ ఆకాష్ ఆధ్వర్యంలో 30 మంది నిరుపేద లకు ఒక్కొక్కరికి 25 కిలోల రైస్ బ్యాగ్ తో పాటు నిత్యవసర సరుకులను అందజేశారు బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ నీలగిరి రాజు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలసధనలో విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందజేసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
బిఆర్ఎస్ నాయకులు చింతకాయల రాజు ఆధ్వర్యంలోలోనూ బాల సదాన్లో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం తో పాటు శిశు సంరక్షణ విభాగంలో పిల్లలకి న్యూట్రిషన్ సంబంధించిన కిట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, దండు శేఖర్ , మాజీ నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్,దాత్రిక పరమేష్,కరిపే రాజు, గాండ్ల లింగం తదితరులు పాల్గొన్నారు.








