HomeCRIMEఅక్రమ వడ్డీ వ్యాపారాలఫై పోలీసుల దాడులు..ఫైనాన్స్‌లు, దుకాణాల్లోనూ విస్తృత తనిఖీలు..రూ 53 .9 లక్షల నగదు...

అక్రమ వడ్డీ వ్యాపారాలఫై పోలీసుల దాడులు..ఫైనాన్స్‌లు, దుకాణాల్లోనూ విస్తృత తనిఖీలు..రూ 53 .9 లక్షల నగదు స్వాధీనం …..బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్ లు ,సెల్ డిడి లు స్వాధీనం

ప్రామిసరీ నోట్లు, బ్లాంక్‌ చెక్కులు స్వాధీనం..అక్రమ వడ్డీ వ్యాపారాలపై పోలీసుల మెరుపు దాడులు దాడులు నిర్వహించారు.

పోలీస్ కమీషనర్ ఆదేశాలతో విస్తృత స్థాయిలో నిజామాబాదు, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీసులు అక్రమ వడ్డీ వ్యాపారులపై గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు.

ఎలాంటి అనుమతులు లేకుండా , రిజిస్ట్రేషన్ సైతం లేకుండా అనేకమంది అక్రమంగా ఫైనాన్స్ లు ఏర్పడి, ఇలా అక్రమ వడ్డీ దండ నిర్వహిస్తున్నారని ఫిర్యాదుల మేరకు ఈ దాడులు జరిపారని తెలిపారు.

సామాన్య పేద కుటుంబాలకు చెందిన వారి అవసరాలను ఆసరాగా చేసుకొని ఫైనాన్స్ పేరుతో వారి వద్ద నుండి అధిక వడ్డీలు వసూలు చేస్తూ వీరిని ఆర్థికంగా మరింత ఇబ్బందులకు గురిచేస్తున, ఈ అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య హెచ్చరించారు.

ఈ దాడుల్లోనిజామాబాదు 27, ఆర్మూర్ 4, బోధన్ 0 ఫైనాన్సియల్ నోట్స్ , అలాగే ప్రామిసరి నోట్స్ :543 ,నిజామాబాద్ లో 610 , 282,సెల్ DD లు 21 , 22వెహికిల్స్1,2, బాండ్ పేపర్స్ 525 నగదు నిజామాబాద్ 53.9 లక్షలు ఆర్మూర్ 20,7660/-,బోధన్12,25,000 స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

అక్రమ వడ్డీ వ్యాపారులు చేస్తున్న ఆర్థిక మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఎవరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments