బిక్కనూర్‌లోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం కారు ను లారీ ని కొట్టిన ఘటన లో మాజీ సర్పంచ్ తో సహా నలుగురికి గాయాలు అయ్యాయి కామారెడ్డి నుంచి హైదారాబాద్ వెళ్తున్న వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కి తరలించారు.
కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వీరంతా బాన్సువాడ మాజీ సర్పంచ్ సంగారెడ్డి కుటుంబీకులుగా చెప్తున్నారు బిక్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు
