రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోజరిగింది. ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న కానిస్టేబుళ్ల ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు అక్కడిక్కడే మృతి చెందారు.
ఆదివారం తెల్లవారుజామున జాలిగామ బైపాస్ రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది..మృతుల్లో ఒకరు రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న పరంధాములు, మరొకరు దౌల్తాబాద్ స్టేషన్ లో కానిస్టేబుల్ పూస వెంకటేశ్వర్లుగా గుర్తించారు.
ఈసీఎల్‌లో జరుగుతున్న మారథాన్ రన్నింగ్ పాల్గొనడానికివీరిద్దరూ ఓకె ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది
