నిజామాబాద్ నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆదేశాల మేరకు పేకాట ఆడుతున్న 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
సీఐ పురుషోత్తం ఆద్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు మల్లారం మేఘన డెంటల్ కళాశాల పక్కన పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.వారి నుంచి రూ.103810 నగదు స్వాధీనం చేసుకున్నట్లు
తెలిపారు.నిందితులను రూరల్ పోలీస్లు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో లక్ష్మన్న, నరసయ్య, సుధాకర్, రాజేశ్వర్,రాములు, అనిల్ కుమార్, ఆజాములు పాల్గొన్నారు.
