గాంధారి మండలం కాయితీ తండా నుండి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది వ్యక్తులు ట్రాక్టర్ పైన చద్మల్ తండా గ్రామ లక్ష్మమ్మ టెంపుల్ వద్దకు వెళ్తుండగా అదుపుతప్పి ఒకరు మృతి చెందినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. నేరల్ గ్రామం రైతు వేదిక వద్ద టాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో ట్రాక్టర్ పై గల మంజ గణేష్( 15 ) అనే యువకుడు అక్కడే మృతి మృతి చెందాడు, మరొక వ్యక్తి మంజ కిషన్ కు తీవ్ర గాయాలు కాగా కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించాము ఆయన తెలిపారు.
