.తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2001 బ్యాచ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు అదనపు డీజీపీ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పదోన్నతి పొందిన వారిలో డాక్టర్ అకున్ సబర్వాల్, జి. సుధీర్ బాబు ఉన్నారు. సుధీర్ బాబును అడిషనల్ డీజీపీగా పదోన్నతి కల్పించినప్పటికీ, ప్రస్తుతానికి ఆయన్ను రాచకొండ సీపీగానే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన 2026 జనవరి 1వ తేదీ నుండి లేదా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి అదనపు డీజీపీ హోదాలో కొనసాగుతారు.
ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న అకున్ సబర్వాల్‌కు కూడా ప్రభుత్వం అడిషనల్ డీజీపీగా పదోన్నతి కల్పించింది. ఆయనకు ప్రొఫార్మా ప్రాతిపదికన ఈ పదోన్నతి లభించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. 2001 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈ అధికారులు సూపర్ టైమ్ స్కేల్ (i) నుండి అదనపు డీజీపీ స్థాయికి చేరుకోవడం విశేషం..
