……సంక్షేమ హాస్టల్ నిర్వహణ ను మరింత మెరుగు పర్చేలా ప్రభుత్వం సీరియస్ గా కసరత్తులు చేస్తుంది. వరుస ఘటనలు ప్రభుత్వ ప్రతిష్ట ను మసక బారేలా చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం దిద్దుబాటు చర్యలకు దిగింది. ముఖ్యంగా వసతులలేమి …
నాణ్యత లేని భోజనం వంటి వ్యవహారాలు సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో సర్కార్ వైఫల్యాలను వెక్కింరించాయి. గత ప్రభుత్వం ఎంతో గర్వంగా చెప్పుకునే గురుకులాల ను రేవంత్ ప్రభుత్వం కావాలనే నీరుగార్చుతోందనే వాదన ను బిఆర్ యస్ విస్తృతంగా ప్రచారం చేసింది. దీనితో ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల తో పాటు గురుకుల నిర్వహణ ను మరింత మెరుగు చేసే దిశగా కార్యాచరణ మొదలు పెట్టింది.
ఓ దశలో గురుకులాల్లో వరుస ఉదంతాలలో కుట్ర కోణం కూడా వుందని ప్రభుత్వం అనుమానించింది ఆ మేరకు పోలీసులను సైతం పురమాయించింది. కానీ యంత్రాంగం మొద్దు నిద్ర లో వుండడం వల్లే అనర్థాలు జరుగున్నట్లు ఆలస్యంగా గుర్తించిది. దీనిపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఓ ఉన్నత స్థాయి రివ్యూ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
అప్పటి నుంచే సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ గాడి లో పడింది. కలెక్టర్ లను రంగంలోకి దించింది. మెస్ ఛార్జి లను భారీగా పెంచేసింది అలాగే కామన్ డైట్ ను అమల్లోకి తెచ్చింది సీఎం తో పాటు మంత్రులు ఎమ్మెల్యే లు ఎక్కడిక్కడే సంక్షేమ హాస్టళ్లు తనిఖీ లు చేస్తున్నారు . స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలిస్తున్నారు .
స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. డైట్ చార్జీలను 40శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవలే అమలులోకి తెచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది అరా తీస్తున్నారు .
ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని నిర్వాహకులకు పదే పదే చెప్తున్నారు . నిర్లక్ష్యానికి తావివ్వకుండా, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని చెప్తున్నారు .
విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి, అందుబాటులో ఉంచిన ఔషధాలు, వాటి కాలపరిమితిని తనిఖీ చేశారు. ఇదివరకు ఆరోగ్య పరీక్షలు జరిపిన విద్యార్థులకు కూడా మళ్లీ క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ నిర్వహించాలని అన్నారు.
అనంతరం పదవ తరగతి గదిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులను పలకరించారు. పలు ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్ధ్యాన్ని అంచనా వేశారు. చక్కగా చదువుకుని వృద్ధిలోకి రావాలని మార్గనిర్దేశం చేశారు.
ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక బోధన అందిస్తూ, మరింత మెరుగైన ఫలితాలు వచ్చే లా కార్యాచరణ వుండాలని నిర్వహుకాలకు హితబోధ లు చేస్తున్నారు
