జిల్లాకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఎక్కడ?
హిందూ దేవుళ్ళ పై ప్రమాణాలు చేసి రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం..
నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ..
ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలనీ నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు.ఆదివారం నగరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
జిల్లాలో 468 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కేవలం 40 కేంద్రాలకు కొబ్బరికాయలు కొట్టారని ఎద్దేవ చేశారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9 నాటికి పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి జిల్లా ప్రచార కార్యక్రమం లో ఆ జిల్లాకు చెందిన హిందూ దేవుళ్ళ పై ప్రమాణాలు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించాడు.
అలాగే కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ వాగ్దానాలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయక ఇప్పటికే సగానికి పైగా రైతులు ధాన్యం దళారులకు అమ్ముకున్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రైతుల సపోర్ట్ చేస్తేనే అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు.
జిల్లాకు అండగా ఉంటారనుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.కేవలం మంత్రి పదవి ఇస్తేనే లెటరేట్ పంపుతాను లేదంటే అప్పటివరకు నా దగ్గరకు రావద్దని అన్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో 28 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో ఏర్పాటుచేసి కనీసం జిల్లాకు ఒక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాల కూడా తీసుకురాలేదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డినీ ప్రశ్నించారు.
అలాగే 6 వ తేదీ నుంచి రాష్ట్రం లో నిర్వహించే కుల గణన ను ఎలాంటి అవినీతికి తావులేకుండా, నిక్కచ్చిగా, తొందరగా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక ఎన్నికలను తక్షణమే స్పందించి ఎన్నికలను నిర్వహించాలని సూచించారు.గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని,కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందనీ ఎద్దేవ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలోని మంచిప్ప ప్రాజెక్టు కోసం రూ 2600 కోట్లు నిధులు మంజూరు చేసిందనీ,అందులో రూ 2100 కోట్లు పైపుల కోసం మంజూరు చేసింది.ప్రాజెక్టు పైపులు తీసుకొచ్చి ,దానికి సంబంధించి బిల్లులు కూడా ముట్టాయని తెలిపారు.మంచిప్పా ప్రాజెక్టు కడితే చుట్టూ పక్కల గ్రామాలు ముంపుకు గురవుతాయను పేర్కొన్నారు.
ప్రస్తుతం కేటీఆర్ నిర్వహించే పాదయాత్ర లో ప్రజలు చీపురులతో స్వాగతం పలుకుతారాని విమర్శించాడు. అలాగే ఎన్నికల ఇచ్చిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, జనవరి నాటికి తులం బంగారం, ఇస్తామని చెప్పిన, ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
