ప్రాధాన్యత లేని పదవీ కట్టబెట్టారంటూ చిన్నబుచ్చుకున్న గడుగు ఎట్టకేలకు మెత్తబడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి గడుగు తన ఇంటికి పిలుచుకొని బుజ్జగించారని సమాచారం.
ఏ పరిస్థితిలో ఆ బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు న్యాయ శాస్రం లో పట్టు వుండడం వల్లే వ్యవసాయ సంక్షేమ కమిషన్ లో ప్రాతినిధ్యం కల్పించానని అనేక జుడీషియరీ అధికారాలుండే పోస్టు అని పదవీ కాలం పూర్తీ అయ్యాక రెండో దఫా లో మరింత మెరుగైన పదవీ వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు.
దీనితో గడుగు మెట్టుదిగారు.ఈ మేరకు శనివారం హైదారాబాద్ లో బాధ్యతలు చేపట్టారు. ఇక నుంచి ఆయన కేవలం అధికార కార్యక్రమాలకే పరిమితం కావాల్సి వుంటుంది. పార్టీ వేదిక కు దూరంగా వుండాలి.
జిల్లా కాంగ్రెస్ లో సీనియర్ నేతగా గత పదేళ్లు క్రియాశీల నేతగాపనిచేసి గడుగు గంగాధర్ గతంలో పదేళ్ల పాటు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసారు పదేళ్ల తరవాత పార్టీ అధికారం లోకి రావడంతో గతంలో చేజారిన యస్సి కమిషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లను కోరారు.
పీసీసీ ప్రధాన కార్యదర్శి గా ఉన్న తనకు రాష్ట్ర స్థాయి పోస్టు ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ ఉమ్మడి జిల్లా నుంచి అప్పటికే అయిదు గురి నేతలకు కార్పొరేషన్ ఛైర్మెన్ లు కేటాయించారు మరో పోస్టు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే కమిషన్ లో సభ్యుడిగా సర్దు బాటు చేశారు.
