అతివేగంతో కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన సంఘటన నగరంలోను రెండవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులపేట్ మున్నూరుకపు సంఘం వద్ద అతి వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంటి కపౌండ్ గోడ కూలడంతో పెద్ద శబ్దం వచ్చింది.
హుటాహుటిన ఇంట్లో నుంచి బయటకు పరుగులు చేశారు. అందరూ ఇంటి లోపల నిద్ర పోతుండటంతో పెను ప్రమాదం తప్పింది.కారు లో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులోనే ఇంటిని ఢీ కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారును పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.
