HomeCRIMEపెళ్లికి రెండు రోజుల ముందు వరుడు ఆత్మహత్య

పెళ్లికి రెండు రోజుల ముందు వరుడు ఆత్మహత్య

రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, అంతకుముందే వరుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఎడపల్లి మండలం మంగళపాడు గ్రామంలో పెళ్లి వేడుకకు సిద్ధమైన కుటుంబంలో వరుడు ఆత్మహత్య తీవ్ర విషాదం నింపింది .

వివరాల్లోకి వెళ్లితే గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ (31) సోమవారం పొలానికి వెళ్లి వస్తానని చెప్పిన ఇంట్లో నుంచి సాయంత్రం అయిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల ఎంత తిరిగినా ఆచూకీ లభించలేదని స్థానిక ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

దీంతో మంగళవారం రాత్రి గ్రామం శివారులోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతని పెళ్లి గురువారం జరగాల్సి ఉండగా, ఆత్మహత్య వార్తతో అంతా విషాదంలో మునిగిపోయింది.

ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని బోధన్ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments