HomeLaw and Orderప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు...

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు…

సగం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరు..తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్‌ 3 పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి.

ఈ గ్రూప్‌ 3 పరీక్షలు నవంబర్ 17న ఉదయం సెషన్‌లో 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 1 పరీక్ష, అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరిగింది.

అదేవిధంగా నవంబర్‌ 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 3 పరీక్ష నిర్వహించడంతో మూడు పేపర్లకు పరీక్షలు పూర్తయ్యాయి.

మొత్తం 1,365 గ్రూప్‌ 3 సర్వీసు పోస్టుల భర్తీకి గానూ ఈ రాతపరీక్షలు నిర్వహించారు. ఈ రాతపరీక్షల కొరకు నిజామాబాద్ జిల్లా లో మొత్తం 66 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అభ్యర్థులను హాల్లోకి అనుమతించారు.

పరీక్షా సమయానికి గంట ముందు ఆయా కేంద్రాల వద్ద అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అరగంట ముందు పరీక్షా కేంద్రంలోకి అనుమతించడంతో అభ్యర్థులు బారులు తీరారు. పలువురు అభ్యర్థులు సమయం ఆలస్యం కావడంతో పరీక్ష కేంద్రం నుంచి తిరిగి వెళ్ళిపోయారు.

మరికొందరు ఉరుకులు, పరుగుల మధ్య ఆఖరి నిమిషంలో కేంద్రాలకు చేరుకున్నారు. టీజీపీఎస్సీ నిరచించిన గ్రూప్ 3 పరీక్షలో ఈ సారి సుమారు సగటు 49.54 శాతం సగం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరుకావాడం ఈ సారి విశేషం.

ఆదివారం ఉదయం జరిగిన మొదటి సెషన్ లో మొత్తం 19,941 మందు అభ్యర్థులకు గను 10,037మంది హాజరు కాగా 9904 మంది అభ్యర్థులు గైహాజరు అయ్యారని తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన రెండవ సెషన్ లో 9992 మంది అభ్యర్థులు హాజరు కాగా, 9949 మంది గైహాజరు అయ్యారు.

అలాగే సోమవారం రెండవ రోజు జరిగే మూడవ సెషన్ లో మొత్తం 19,941 మందికి గానూ 9880 మంది హజరు కాగా,10,058 మంది అభ్యర్థులు గైహజరు అయ్యారని పేర్కొన్నారు.

ఈ గ్రూప్ 3 పరీక్షలో మొత్తం సుమారు సగటు 49.54 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరు కావడం ఈ సారి విశేషం. ఇంత భారీగా హాజరుశాతం ఎందుకు తగ్గిందనే దానిపై అభ్యర్థుల్లో సర్వత్రా చర్చ సాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments