. తుపాకీ మిస్ ఫైర్ కావడంతో సీఐ ఎస్ యాప్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన బిడియల్ బానూర్ లో జరిగింది . శనివారం విధులు ముగించుకుని వాహనంలో వెళ్తుండగా
ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు. గత ఏడాది బదిలీ పై బీడీఎల్‌కు వచ్చిన వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఇక్కడే విధుల నిర్వహిస్తున్నాడు. శనివారం విధులు ముగించుకుని బస్సులో వెళ్లిన వెంకటేశ్వర్లు..
బస్సు దిగుతోన్న క్రమంలో తనవద్ద ఉన్న గన్ మిస్ ఫైర్ అయ్యి బుల్లెట్ బాడీలోకి దూసుకెళ్లడంతో మరణించాడు. తుపాకీ మిస్ ఫైర్ కావడం వల్లే వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు అధికారులు చెప్తున్నారు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.