సాధారణ బదిలీల్లో భాగంగా పశు సంవర్ధక శాఖలో ను పలువురు అధికారుల బదిలీ లు జరిగాయి. కానీ ఇందులో కొందరు అధికారుల బదిలీ రచ్చ కు దారి తీసింది.
కొందరు అధికారులు శనివారం నిజామాబాద్ నగరంలోని వెటర్నరీ ఆఫీసర్ఎదుట బైఠాయించారు బాసర జోన్ పరిధిలో మొత్తం 14 పోస్ట్లు ఉన్నాయి.అందులో నిజామాబాద్ జిల్లా లో 6 పోస్టు లో ఉన్నాయని పేర్కొన్నారు.
అందులో 12 ప్లేస్ లో ఉన్న కల్యాణి కి వరుస క్రమంలో చూస్తే నిజామాబాద్ జిల్లాలో బదిలీ ఉండాలి. కానీ 13,14 ప్లేస్ లో ఉన్న అధికారులకు పోస్టింగ్ ఇవ్వడం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోస్టు తీసుకొని ముందున్న వారిని జగిత్యాల కు బదిలీ చేశారు. ఈ మేరకు అన్యాయం జరిగిన అధికారులు ఆందోళనకు దిగారు.