హైదారాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో హెచ్ పాస్ట్ 13 మసాలా వ్యాపార సంస్థమీద విరుచుక పడింది 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకుని మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సిటీ సీపీ సజ్జనార్ వెల్లడించారు.
ఈ దాడులకు సంబంధించిన వివరాలను ఇవాళ హైదరాబాద్ సీపీ సజ్జనార్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.తిరస్కరించబడిన, నాణ్యత లేని దినుసులతో పాటు మసాలాల్లో సింథటిక్ రంగులు, బట్టల డైలు, టాల్కమ్ పౌడర్, ఇండస్ట్రియల్ కలర్స్ మరియు రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగించి కల్తీ మసాలా దినుసులు తయారు చేస్తున్నట్లు సజ్జనార్ వెల్లడించారు.
ప్రధానంగా వాము, జీలకర్ర, షాజీరా, లవంగాలు వంటి నిత్యం వాడే మసాలా దినుసులను కల్తీ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. అల్లం వెల్లుల్లీ పేస్టులో టైటానియం ఆక్సైడ్ వంటి ప్రమాదకరమైన కెమికల్స్ వినియోగిస్తున్నట్లు చెప్పారు.
నిందితులు ఈ కల్తీ మసాలా తయారీ విధానాన్ని ఇండోర్ తదితర ప్రాంతాల్లో నేర్చుకున్నారని వెల్లడించారు.ఆయన వివరించారు కల్తీదారులపై ఇకపై ఉపేక్షించేది లేదని సీపీ హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 110 కింద హత్యాయత్నం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
