జిల్లాకు వచ్చే పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడానికి అందుబాటులోకి తెచ్చిన హరిత హోటల్ మాటున అధికారులు వసూళ్ల దందా కు తెరలేపారు.
కాసుల కోసం విలువైన హోటల్ ను పార్కింగ్ కు అడ్డా గా మార్చేశారు. భారీఎత్తున సాగుతున్న వసూళ్ల దందాలో ఉన్నత స్థాయిలో వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలున్నాయి. అందుకే స్థానిక అధికారులు అడ్దు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు.
అత్యంత ఖరీదైన స్థలంలో టూరిజం శాఖ కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన హోటల్ పర్యాటకులకు ఏ మేరకు సౌకర్యాలు కల్పిస్తుందో కానీ అధికారులకు కాసులు కురిపిస్తుంది.
నిజామాబాద్ జిల్లా లో ఆయా పర్యాటక ప్రాంతాలను చూడడానికి వచ్చే ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వం హరిత హోటళ్ల ను అందుబాటులోకి తెచ్చింది.
పర్యాటక రంగం ను మరింత ప్రోత్సహించే ఉద్దేశ్యం తో కేంద్ర ప్రభుత్వం సైతం నిధులు ఇస్తుంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో అత్యంత ఖరీదైన స్థలం లో అధునాత హోటల్ ను నిర్మించింది.
హైదరాబాద్ నుంచి బాసర కు వెళ్లే భక్తులకు ఈ హోటల్ ఉపయోగంలోకి వచ్చింది. విశాలమైన పార్కింగ్ ఈ హోటల్ కు కలిసి వచ్చింది.
కానీ ఇలాంటి వసతులతో హోటల్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో టూరిజం ప్రమోషన్ మీద దృష్టి పెట్టి ఆ దిశగా జిల్లాకు వచ్చే పర్యాటకులను పెంచాల్సిన అధికారులు హరిత హోటల్ ను తమ ఆర్థిక అవసరాల తీర్చే వనరుగా చేసారు.
ఈ హోటల్ ను ప్రైవేట్ పార్కింగ్ అడ్డా గా మార్చేశారు. చుట్టుపక్కల ప్రైవేట్ వ్యాపారులతో మామూళ్లు మాట్లాడుకొని వారి వాహనాలను ఇదే హోటల్ ఖాళీ స్థలం లో పార్కింగ్ చేసుకువడానికి అనుమతి ఇచ్చేస్తున్నారు.
ఈ మద్యే సమీప దూరంలో ఉన్న షాపింగ్ మాల్ ఈవెంట్ చేస్తే ఇక్కడే పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఎలా అడపా దడపా గా వచ్చే కాసుల జేబు నింపడలేదనే ఆలోచనతో పక్కనే ఉన్న చెన్నయ్ షాపింగ్ మాల్ యజమాని కి తాత్కాలిక ప్రాతిపదికన హోటల్ కు చెందిన పార్కింగ్ స్థలం ను కేటాయించడానికి డీల్ జరిగింది.
ఎలాగో చెన్నయ్ షాపింగ్ మాల్ యజమానులు పార్కింగ్ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తమ మాల్ లో పార్కింగ్ జాగా కస్టమర్ల కే సరిపోతుంది. కానీ సిబ్బంది టూవీలర్లు పెట్టడానికి స్థలం లేకుండా పోయింది. అందుకే టూరిజం అధికారి ఇచ్చిన పార్కింగ్ అఫర్ ను వారు కాదనలేక పోయారు.
డీల్ సెట్ కావడమే ఆలస్యం సిబ్బంది రోజు సుమారు రెండు వందల వాహనాలను హరిత హోటల్ లో దర్జాగా పార్కింగ్ చేసుకుంటున్నారు.
దీనితో హోటల్ విడిది చేయడానికి వచ్చే వారు తమ వాహనాలను పార్కింగ్ చేయడానికి వ్యయ ప్రయాసాలు పడుతున్నారు. పార్కింగ్ కోసం చెన్నయ్ షాపింగ్ యాజమాన్యం సుమారు 40 వేల రూపాయలు టూరిజం అధికారులకు చెల్లిస్తున్నారు.
అదీగాక ఈ డీల్ సెట్ చేసిన అధికారి కూడా స్పెషల్ ప్యాకేజి ఉంది. నిజానికి హరితా హోటల్ స్థలం లో ప్రైవేట్ సంస్థ కు పార్కింగ్ కు ఇవ్వడం వెనుక పెద్ద తతంగమే జరిగిందిమాజీ ఎమ్మెల్యే కు చెందిన ఈ మాల్ కు హరితా హోటల్ పార్కింగ్ స్థలం కేటాయించడంలో అధికారులే చక్రం తిప్పారట.
అయితే తాము అధికారికంగానే పార్కింగ్ ప్లేస్ కేటాయించామని టూరిజం అధికారి ఇది సంగతి కి చెప్పారు. కానీ ఏ విధంగా కేటాయించారనేది స్పష్టత ఇవ్వడం లేదు.