పోలీస్ కమిషనరేట్ పరిధి లో మరోమారు ఎస్సై ల బదిలీలు జరిగాయి.10 మంది సివిల్ ఎస్సైలు బదిలీ చేస్తూ మంగళవారం పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్మూర్ టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న ఎం గంగాధర్ నిజామాబాద్ ఐదవ టౌన్ కు బదిలీ అయ్యారు. అక్కడే ఉన్న కే వెంకట్రావు ఐదవ టౌన్ నుంచి ఆరవ టౌన్ కు బదిలీ అయ్యారు.
అలాగే బోధన్ రూరల్ ఎస్సైగా ఉన్న ఎం రాజశేఖర్ మాక్లూరు టౌన్ కు బదిలీ అయ్యారు. అదేవిధంగా బోధన్ టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న j. మచెందర్ బోధన్ రూరల్ ఎస్సైగా బదిలీ అయ్యారు.
నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ఐ గా పని చేస్తున్న విక్రమ్ భూపల్లి మోర్తాడ్ ఎస్సైగా బదిలీ అయ్యారు. నిజామాబాద్ సి ఎస్ బి ఎస్సైగా పనిచేస్తున్న పి సాయన్న రుద్రూర్ ఎస్సైగా బదిలీ అయ్యారు.
నిజామాబాద్ నాలుగో టౌన్ వీఆర్ ఎస్సైగా పనిచేస్తున్న పాండేరావు నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్సైగా బదిలీ అయ్యారు. అలాగే నిజామాబాద్ కమిషనరేట్కు వెయిటింగ్ లిస్టులో ఉన్న టీ గోవిందు ఆర్మూర్ టౌన్ ఎస్ఐగా బదిలీ అయ్యారు.
అదేవిధంగా ఆర్మూర్ టౌన్ రెండవ ఎస్సైగా పనిచేస్తున్న జి గంగాధర్ ను నిజామాబాద్ వీఆర్ కు అటాచ్ చేశారు.
అలాగే జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా పని చేస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి ఆర్మూర్ టౌన్ రెండవ ఎస్సైగా బదిలీ అయ్యారు.
