HomePOLITICAL NEWSArmoorఆలూర్ లో 'హస్తం' నేతలు - జిల్లాలో రెండవ రోజు కొనసాగుతున్న జనహిత పాదయాత్ర -...

ఆలూర్ లో ‘హస్తం’ నేతలు – జిల్లాలో రెండవ రోజు కొనసాగుతున్న జనహిత పాదయాత్ర – మొక్కలు నాటి శ్రమదానం చేసిన మీనాక్షి నటరాజన్ – పాల్గొన్న సీతక్క, మోహన్ రెడ్డి, రమేష్ రెడ్డి, వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి

కాంగ్రెస్ జనహిత పాదయాత్ర లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ తో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క లు ఆలూర్ మండల కేంద్రంలో మొక్కలు నాటారు.

ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి శ్రమదానం చేశారు. అనంతరం గ్రామ నడిబొడ్డున సుభాష్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు.

జై సుభాష్ చంద్రబోస్ అంటూ నినాదాలు చేశారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్య … ఈ నాయకునికైనా ప్రజలలో విశ్వాసనీయత ఉండాలి.

ఒకసారి హామీ ఇచ్చిన తర్వాత దానిని తప్పకుండా నెరవేర్చాలి అంటూ… పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను వివరిస్తూ… ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని వీధులలో పాదయాత్ర ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు ఆలూరు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్గుల్ శివారులో ఓ ఫంక్షన్ హాల్లో జరిగే పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి తరలి వెళ్లారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తో పాటు డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సునీల్ రెడ్డి, జిల్లా సహకార సంఘ అధ్యక్షుడు రమేష్ రెడ్డిలతోపాటు కాంగ్రెస్ సేవాదళ్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.p

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments