విద్యుత్ ఘాతం తో ఇంట్లోని విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతైన ఘటన నిజామాబాద్ బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని 13 వ డివిజన్ పరిధిలోని సిడబ్ల్యుసి గోడౌన్ జనపల్లి చౌరస్తా చెందిన సలీం ఖాన్ బొమ్మల వ్యాపారం చేసుకుంటుడు.
ఈమేరకు బుదవారం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా ఇంట్లో మంటలు రేగాయి.ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ విషయం తెలుసుకున్న ఏఐఎంఐఎం బృందం సలీంఖాన్ ఇంటికి చేరుకొని ఆర్థిక సహాయం చేసినట్లు పేర్కొన్నారు.
