హైదారాబాద్ లో మంగళవారం ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. సంక్రాతి పండగ కు వచ్చిన మూడు పెద్ద సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆయా నిర్మాణసంస్థలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదాయపన్ను శాఖ విరుచుక పడింది నిర్మాతలకు సోదాల తో షాక్ ఇచ్చింది.
మైత్రి మూవీస్ తో దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ లే లక్ష్యంగా సోదాలు జరుగుతున్నాయి.ముఖ్యంగా ఈపాటికే పొలిసు కేసు,బెయిల్ జైళ్ల తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పుష్పా 2 నిర్మాతలకు ఆదాయపన్ను శాఖ సోదాలతో సినిమా హిట్ అయినా సంబరమే లేకుండా పోయింది.మొత్తం 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేడుతున్నారు. ఏకంగా 55 బృందాలు రంగంలోకి దిగి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంతో పాటు ఆఫీసులో మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేపడుతున్నారు.
బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ కొండాపూర్ గచ్చిబౌలి తో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్సిత, బంధువులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా అధికారులు జల్లెడ పడుతున్నారు.
ఆయన సంస్థ నిర్మించిన గేమ్ చెంజర్, సంక్రాతి కి వస్తున్నాంసినిమాలు ఈ పండగకు రిలీజ్ అయ్యాయి. ఇందులో సంక్రాంతి కి వస్తున్నాం సినిమా భారీ వసూళ్లు సాదిస్తుంది. గేమ్ చెంజర్ ను భారీ లాభాలతోనే అమ్ముకున్నారు. పుష్పా నిర్మామణ సంస్థ మైత్రి మూవీస్ అధినేతల ఇండ్లలో సోదాలు జరుగుతున్నాయి.పుష్పా సినిమా రెండు వేల కోట్ల క్లబ్ కు చేరువలో ఉంది.
