నిజామాబాద్ జిల్లా, వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా గ్రామంలోని, ప్రసిద్ధి చెందిన పెద్దమ్మ గుడిలో శనివారం రాత్రి పెద్దమ్మ మందిరం యొక్క తాళాలను పగలగొట్టి గుడిలో ఉన్న ఒక విగ్రహంతో పాటు, 500 గ్రాముల వెండి కి రటాన్ని, 6 గ్రాముల బంగారాన్ని గుర్తుతెలియని దొంగలు దొంగిలించకపోయారని వర్ని ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి తెలియజేశారు.
దొంగతనం జరిగిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించడం జరిగిందని త్వరలో దొంగలను పట్టుకుంటామని కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
