సీఎం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పౌరుషం ఉన్నా సరే పదేళ్లు అధికారంలో వేల కోట్ల అవినీతి కి పాల్పడిన కెసిఆర్ ఫ్యామిలీ ని లోపలెయ్యాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు ఆయన ఆదివారం నిజామాబాద్ నగరంలోని అమృత గార్డెన్ లో బీజేపీ సర్పంచ్ ల ఆత్మీయ సమ్మేళనం లో ఆయన మాట్లాడారు
ఉద్యమ నేతగా కెసిఆర్ అంటే తనకు ఎంతో గౌరవం వుందని ఇరిగేషన్ మీద అవగాహన ను ఆసరాగా చేసుకొని 50 వేల కోట్లకు పైగా లూటీ చేసారని,కెసిఆర్ అంత పాపాత్ముడు నమ్మక ద్రోహి తెలంగాణ లో మరొకరు లేరని అర్వింద్ ధ్వజమెత్తారు తెలంగాణ ను ఆర్థికంగా దివాళా తీయించారన్నారు రేవంత్ రెడ్డి నిజంగా పాలమూరు బిడ్డ అయితే వీళ్ల అరెస్టు చేయాలన్నారు.
కెసిఆర్ ను గద్దెదించాలని బీజేపీ గాచారం బాగాలేక కాంగ్రెస్ కు అధికారం ఇస్తే లాగు లో తొండలు వేస్తా అంటూ రేవంత్ మాట్లాడుతున్నాడు తొండలు వదిలే బదులు ఆయనే వారి లాగు లో జొర్రాలన్నారు కెసిఆర్ ను లొపేయాలని ప్రజలు అధికారం యిస్తే వారితో ఫ్యాకేజి మాట్లాడుకున్నావా అంటూ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ పదే పదే కెసిఆర్ వయసు ఎందుకు గుర్తు చేస్తున్నారని దీని వెనుక మర్మము ఏమిటన్నారు
