మహారాష్ట్ర నుంచి నవిపేటకు నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని నవీపేట్ మండలం యంచ వద్ద కారులో తరలుతున్న మధ్యాన్ని పట్టుకున్నట్లు ఎక్సైజ్ అధికారి స్వప్న పేర్కొన్నారు.
యంచ చెక్ పోస్టు వద్ద రూట్ వాచ్ నిర్వహించగా ఓ కారు లో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం ను పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సిడస్ ప్రీమియం పోర్ట్ వైన్- 15 సీసాలు(750మి.లీ),11.250 లీటర్లు,అలాగే రాయల్ ఛాలెంజ్ ఫైనెస్ట్ ప్రీమియం విస్కీ–2లీటర్లు,2బిటిల్స్ 4 లీటర్లు, దేశీదారు–(4) సీసాలు–4 లీటర్లు, మొత్తం 19.25 లీటర్ల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వ్యక్తిని అరెస్టు చేసి, వ్యక్తితో పాటు కేసు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి ప్రక్రియ కోసం నిజామాబాద్ స్టేషన్కు అప్పగించినట్లు పేర్కొన్నారు.
