HomeCinemaబెయిల్ ఇచ్చిన జైలు .....రాత్రంతా చంచల్ గూడా లోనే...... తెల్లవారు జామున విడుదల .........ఇంటికి చేరిన...

బెయిల్ ఇచ్చిన జైలు …..రాత్రంతా చంచల్ గూడా లోనే…… తెల్లవారు జామున విడుదల ………ఇంటికి చేరిన అల్లు అర్జున్

నాటకీయ పరిణామాల మధ్య చంచల్‌గూడ జైలు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శనివారం విడుదల అయ్యారు. ఎట్టకేలకు ఒక్కరోజైనా జైలు లో వుండాలనే పంథా నెగ్గింది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిస లాటలో మహిళా మృతి ఘటన లో 11 నిందితుడిగా ఉన్న అల్లుఅర్జున్ ను పక్క ప్రణాళిక మేరకు కోర్టు కు వరుస సెలవులలను చూసుకొని శుక్రవారం అరెస్టు చేశారు.

అదికూడా మధ్యాహ్నం తర్వాత సో అల్లు అర్జున్ తరుపున న్యాయవాదులు హైకోర్టు నలో పిటిషన్ దాఖలు చేయడానికి కష్టం అయింది.దీనితో సాయంత్రం నాలుగు గంటలకు అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ వెంటనే ఉత్తర్వ్యూలను ఆన్ లైన్ లోనే జైల్ అధికారులకు వెళ్లాయి. మరో వైపు హైకోర్టు లో విచారణ జరుగుండగానే పోలీసులు ముందుగా వేసుకున్న ప్లాన్ మేరకు హుటాహుటిన వైద్య పరీక్షలు జరిపి నాం పల్లి కోర్టు లో హాజరు పరిచి అక్కడి నుంచి నేరుగా చంచల్ గూడా జైలు కు సాయంత్రం నాలుగున్నర గంటలకు పంపారు.

కానీ కొద్దీ సేపటికే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఉత్తర్వ్యూలను పరిశీలించిన జైలు అధికారులు అర్జున్ విడుదల చేసే విషయంలో సాంకేతిక అంశాల ను సైతం పరిగణలోకి తీసుకున్నారు ఆ కాపీలను నేరుగా జైళ్ల డిజి చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాకా జైలు అధికారులు నిరీక్షించారు.

ఎట్టకేలకు శనివారం తెల్లవారుజామున ఆయన్ను జైలు వెనుక గేటు నుంచి విడుదల చేశారు చంచల్‌గూడ జైలు నుంచినేరుగా అల్లు స్టూడియో కు వెళ్లి అక్కడే న్యాయ నిపుణులతో మాట్లాడి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను కలిసి కంట తడిపెట్టుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments