HomeCRIMEముత్తూట్ ఫైనాన్స్ కు టోకరా...డబ్బులు తీసుకొని వ్యక్తి పరార్...కేసు నమోదు కు పోలిసులు మీనమేషాలు..

ముత్తూట్ ఫైనాన్స్ కు టోకరా…డబ్బులు తీసుకొని వ్యక్తి పరార్…కేసు నమోదు కు పోలిసులు మీనమేషాలు..

ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ లో బంగారం పై లోన్ తీసుకొని అధిక లాభం పొందవచ్చని ఓ వ్యక్తి ఏకంగా కంపెనీ డీలర్ నే నమ్మించి డబ్బులు తీసుకొని పరార్ అయ్యాడు. ఈ సంఘటన నిజామాబాద్ ముత్తూట్ ఫైనాన్స్ లో జరిగింది.

వివరాల్లోకి వెళ్లితే నగరంలోని పోచమ్మ గల్లీ కి చెందిన శీల సాయి కుమార్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళారు.అక్కడ ఉన్న ఉద్యోగిని కలిసి నాకు బంగారం పై రుణం మంజూరు చేయాలని కోరారు.

అందుకు అంగీకరించిన ఉద్యోగి రుణం మంజూరు కోసం కావలసిన అన్ని విషయాల పేర్కొన్నారు. సదరు వ్యక్తి తన వద్ద రెండు తులాల బంగారు పైన వేరొక బ్యాంక్ లో రుణం తీసుకున్నానని తెలిపాడు.

మీ కంపెనీలో రుణం మంజూరు చేస్తే నా రెండు తులాల బంగారం పై రుణం కట్టేసి మీ బ్యాంక్ లో రుణం తీసుకుంటానని నమ్మించి, వ్యక్తి ఖాతాలో రూ.1.18 లక్షల నగదు ను జమ చేసినట్లు తెలిపారు.

అనంతరం నగదును బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చే క్రమంలో వ్యక్తి నగదు, వెంట తీసుకొచ్చిన బంగారం తో సాయి కుమార్ పరార్ అయ్యినట్లు ఉద్యోగి వాపోయాడు. చుట్టూ పక్కల ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు.

అతని పై కేసు నమోదు కోసం నగరంలోని నాలుగవ టౌన్ ను ఆశ్రయించారు.కేసు నమోదుకు పోలిసులు మీనమేషాలు…వ్యక్తి బంగారం, నగదు తీసుకొని పరార్ అవ్వడంతో ఫైనాన్స్ కంపెనీ వారు నాలుగవ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. అందుకు పోలీసులు కేసు నమోదు కు నిరాకరించినట్లు తెలుస్తోంది.

అది సివిల్ కు సంబంధించి విషయం,మేము కేసు నమోదు చేయమని ఎస్ఐ ఖరాఖండిగా తెలిపినట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments