బాసరలో శ్రీ శృంగేరి శంకరమఠం వారి శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ఠాపన , కుంభాభిషేక మహోత్సవంబాసరలోని శ్రీ శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ఠాపన మరియు కుంభాభిషేక మహోత్సవం అక్టోబర్ 17 నుండి 19, 2025 వరకు భక్తి పూర్వకంగా నిర్వహించబడనుంది.
అక్టోబర్ 19వ తేదీ ఆదివారం, ఆలయ కుంభాభిషేకం జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి కరకమలములచే వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు చిట్టిమిల్ల హరిప్రసాద్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
భవిష్యత్తులో ఈ ఆలయంలో వేదపాఠశాల, మహానంది, భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ, మరియు వసతి సదుపాయాలు ఏర్పాటు చేయబడనున్నాయని తెలిపారు. ఈ ఆలయం భవిష్యత్తులో మహా పుణ్యక్షేత్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —> “ఈ ఆలయం నిర్మాణం నిజామాబాద్ నగరంలోని లలిత ఆశ్రమ ఆలయ వ్యవస్థాపకులు కీర్తిశేషులు వేలేటి సుధాకర్ శర్మ గారి కోరిక మేరకు భక్తులు, ప్రముఖులు, మరియు శృంగేరి మఠం సహకారంతో నిర్మించబడింది.
ఆయన ఆత్మ సాక్షిగా ఈ ఆలయం రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందదాయకం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిష్ఠాపన మరియు కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య నిర్వాహకులు వేలేటి రాజేందర్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు కొమ్మ సుధాకర్, మోటూరు వెంకటేశం, బచ్చు గోపాల్, ముత్యపు సంతోష్, శనిశెట్టి అభిషేక్, పి. సతీష్ రావు (బాసర మాజీ సర్పంచ్) తదితరులు పాల్గొన్నారు.
