నిజామాబాద్ మేయర్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇందుకోసం ఎడతెగని కసరత్తులు చేస్తుంది. అభ్యర్థుల ఖరారు లో అన్ని తానై వ్యవహరించిన పీసీసీ చీఫ్ మహేష్ తదుపరి బాధ్యతలు అప్పగించారు
సీఎం. గత రాత్రి సీఎం మహేష్ తో భేటీ అయ్యారు. మంత్రి ఉత్తమ్ తో కల్సి నిజామాబాద్ మేయర్ అభ్యర్థి ని ఖరారు చెయ్యాలని కోరారు. ఈ మేరకు ఆదివారం శివరాత్రి పర్వదినం కావడంతో ఈ రోజు రాత్రే మహేష్, ఉత్తమ్ లు భేటీ కాబోతున్నారు.
మేయర్ స్థానం జనరల్ మహిళా అయినప్పటికి జనరల్ మహిళా కార్పొరేటర్ లేక పోవడంతో బీసీ వర్గాలకు మేయర్ పీఠం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.గెలిచిన అభ్యర్థుల సమాలోచనలు జరిపిన నేపథ్యంలో మేయర్ పదవి ఆశిస్తున్న నేతల సామజిక ఆర్థిక నేపథ్యంలో పాటు నేర చరిత్ర ను సైతం పరిగణలోకి తీసుకుంటున్నారు.
ఈ మేరకు ఇంటిలిజెన్స్ పోలీసు వర్గాల నుంచి సైతం ఇన్ పుట్స్ తెప్పించుకుంటున్నారు. మరో వైపు మేయర్ పదవి బీసీ వర్గాల్లో ఏ సామజిక వర్గంకు కేటాయించాలనే విషయంలో మాత్రం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధి ని ప్రామాణికంగా తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
లోకసభ పరిధి లో ఎనిమిది మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరిగాయి జిల్లా పరిధి లోని బోధన్ ఆర్మూర్ బీమ్ గల్ జగిత్యాల్ జిల్లా పరిధి లోని రాయికల్ మెట్ పల్లి కోరుట్ల జగిత్యాల్ మున్సిపాలిటీ లున్నాయి వీటన్నిటికీ సోమవారమే ఛైర్మెన్ వైస్ ఛైర్మెన్ లను ఎన్నుకోవాలి. ఛైర్మెన్ వైస్ చైర్మన్ లావిషయంలో సామజిక సమతుల్యం పాటించే యోచనలో పీసీసీ ఉంది.
మెజార్టీ మున్సిపాల్టీ ల్లో బీసీ లకే ఛైర్మెన్ స్థానాలు దక్కబోతున్నాయి ఛైర్మెన్ బీసీ లకు వర్గాలకు వస్తే వైస్ చైర్మెన్ ఇతర వర్గాలకు ఇవ్వనున్నారు.
బీసీ వర్గాల విషయంలోనూ మున్నారు కాపు ముదిరాజ్ ..యాదవ్ …పద్మశాలి వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు నిజామాబాద్ మేయర్ గా బీసీ లకు ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ గా మాత్రం యంఐయం కు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధం అవుతుంది. మేయర్ గా మున్నారు కాపు లేదా ముదిరాజ్ వర్గాల్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఆసక్తి గా మారింది
