HomeTelanganaNizamabadప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానాపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాననీ 21వ...

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానాపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాననీ 21వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని పంచరెడ్డి లలిత చరణ్

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానాపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాననీ 21వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని పంచరెడ్డి లలిత చరణ్ అన్నారు.

శుక్రవారం హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో కాంగ్రెస్ అభ్యర్థి పంచారెడ్డి లలిత చరణ్ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు.విజయం అనంతరం తొలిసారి డివిజన్‌లోకి ప్రవేశించిన లలిత చరణ్‌కు స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు.

మహిళలు మంగళహారతులతో, యువత జై కాంగ్రెస్ నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.పూలమాలలతో ముంచెత్తుతూ, గజమాలలతో సత్కరిస్తూ తమ ప్రియతమ నేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ఈ సందర్భంగా లలిత చరణ్ మాట్లాడుతూ.. “ఈ విజయం నా ఒక్కడిది కాదు, 21వ డివిజన్ ప్రజలందరిది. నాపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను.

డివిజన్ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటాను” అని భావోద్వేగంతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు డివిజన్ వాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments