లోకసభ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో యం ఐ యం ఎటూ తేల్చుకోలేక పోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ యస్ కు బాహాటంగా మద్దతు పలికిన ఆ పార్టీ ఇప్పుడు మౌన వ్యూహం అనుసరిస్తుంది. కానీ పదేళ్లు బిఆర్ యస్ తో చెట్టపట్టాలు లేసుకొని రాజకీయ అడుగులు లేసిన మజ్లీస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతఅధికారం కోల్పోయిన బిఆర్ యస్ కు దూరమవుతుంది.
అదే సమయంలో హైదారాబాద్ లో రాజకీయ అవసరాలమేరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతుంది. కానీ గులాబీ పార్టీతో పదేళ్ల దోస్తాని తెగతెంపులు చేసుకోలేక పోతుంది. లోకసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వాలనేది తేల్చలేక పోతుంది. మరో వైపు అధినేత హాసద్ వుద్దీన్ పోటీ చేస్తున్న హైదారాబాద్ లోకసభ నియోజకవర్గం లో బిఆర్ యస్ కాంగ్రెస్ లు కూడా బలమైన అభ్యర్థులనే రంగంలోకి దించడానికి ఆసక్తి చూపడం లేదు. రెండు పార్టీలూ హాసద్ విషయంలో సానుకూల దృక్పథం ను అనుసరిస్తున్నాయి.
కానీ యంఐయం హైదారాబాద్ మినహా మిగితా 16 నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదు. అందుకే ఆ నియోజకవర్గాల్లో ఆపార్టీ ఎవరికి మద్దతు ఇవ్వనున్నారనేది రాజకేయవర్గాల్లో ఉత్కంఠ గా మారింది.ఇప్పటికయితే జిల్లాలో యంఐయం క్యాడర్ కు దారుస్సలాం నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు అంద లేదు.ముఖ్యంగా ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న నిజామాబాద్ ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రభావం ఎక్కవగా వుంటుంది. అందులోనూ నిజామాబాద్ నగరంలో 16 మంది కార్పొరేటర్లు ఉన్నారు. బోధన్ ,ఆర్మూర్ జగిత్యాల్ ప్రాంతాల్లోనూ పట్టుంది.
కానీ లోకసభ ఎన్నికల నామినేషన్ ల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో క్యాడర్ లో గందరగోళం ఏర్పడింది. అందుకే బోధన్ నిజామాబాద్ సెగ్మెంట్ లలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి .కొందరు కార్పొరేటర్లు తలోదారి చూసుకుంటున్నారు. అర్బన్ లో కొందరు కార్పొరేటర్లు . నిజామాబాద్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తో భేటీ కావడం చర్చనీయాంశం అయింది .
సోమవారం రాత్రి బోధన్ రోడ్ లో ఉండే ప్రముఖ రియల్ ఎస్టేట్ కార్యాలయం లో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత రహీమ్ సోఫీ మధ్యవర్తిగా వ్యవహరించారు . యం ఐ యం కు చెందిన ఆరుగురు కార్పొరేటర్లు ఈ భేటీ లో ఉన్నట్లు సమాచారం. అయితే జీవన్ రెడ్డి తో వీరు ఏ విషయాలు మాట్లాడారు ఎలాంటి ఒప్పందాలు జరిగాయనేది బయటికి పొక్కడం లేదు.కానీ విషయం తెలిసి దారుస్సలాం వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ఎవరెవరు ఈ భేటీకి వెళ్లారనేది అరా తీస్తున్నారు. ఈ భేటీ యాదృచ్చికంగా జరిగిందని చెప్పినట్లు సమాచారం.
తామంతా మాట్లాడుతుంటే అక్కడికి జీవన్ రెడ్డి వచ్చారని వారు చెప్తున్నారు. మరో వైపు బిఆర్ యస్ నేతలు సైతం లోకసభ ఎన్నికల అవసరాలమేరకు వారిని చేరదీసి పనిలో పడ్డారు. మెజార్టీ కార్పొరేటర్లు ఇంకా పార్టీ ఆదేశాలమేరకు అడుగు ముందుకెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు
