తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల చేశారుతెలంగాణ ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మనబడి వెబ్‌సైట్ http://www.manabadi.co.in/ లో కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు:రీ కౌంటీగ్, రీ వాల్యూయేషన్ చేసుకునే విద్యార్దులకు ఏప్రిల్ 25 నుండి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 68.35 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 72.53 శాతం మంది అమ్మాయిలు పాస్ అయ్యారు. అలాగే ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 51.5 శాతం బాలురు పాస్ అవ్వగా, సెకండియర్లో 56.1 శాతం ఉత్తీర్ణఉలయ్యారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు.
మేడ్చల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక సెకండ్ ఇయర్లో ములుగు జిల్లా విద్యార్థులు టాప్ చేయగా, రెండో స్థానంలో మేడ్చల్ జిల్లా నిలిచింది.పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులతోపాటు తక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి మే 24 నుండి అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.మొదటి సంవత్సరం ఫలితాల్లో రంగారెడ్డి 71.7శాతంతో మొదటి స్థానంలో నిలిచింది.
34.81 శాతంతో కామారెడ్డి చివరి స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 82.95 శాతంతో ములుగు మొదటి స్థానం. 44.29 శాతంతో కామారెడ్డి చివరి స్థానంలో నిలిచింది.ఇంటర్ మార్కుల్లో అనుమానాలు, సందేహాలు ఉంటే 040-24655027 హెల్ప్ డెస్క్ నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. లేదా kelpdesk-ie@telangana.gov.inకు మెయిల్ పంపవచ్చు.