Thursday, April 23, 2026
HomeTelanganaNizamabadముగిసిన ఇంటర్ పరీక్షలు .... జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

ముగిసిన ఇంటర్ పరీక్షలు …. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

2025 – 26 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలో ఇంటర్ ప్రధాన పరీక్షలు శుక్రవారంతో ముగిశాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. మరో 17 పరీక్ష కేంద్రాల్లో వోకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు సోమవారం వరకు జరుగుతాయని ఆయన తెలియజేశారు.

జిల్లాలో ఈ సారి పకడ్బందీ చర్యల ద్వారా ఎలాంటి కాపియింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, హైపర్ కమిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సిట్టింగ్స్ స్క్వాడ్ బృందాలు నిరంతరం జిల్లాలోని 58 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తూ పర్యవేక్షణ చేయడం జరిగిందని తెలియజేశారు.

ఈసారి జిల్లాలో ఒకే విద్యార్థి పై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు అయిందని ఆయన తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణకు పోస్టల్ డిపార్ట్మెంట్, విద్యుత్తు, ఆర్టీసీ, రెవెన్యూ, పోలీస్ ఇతర అన్ని శాఖల సమన్వయం, సహకారంతో పరీక్షలను ఇంటర్ అధ్యాపక, అధ్యాపకేతర బృందం ప్రశాంతంగా నిర్వహించిందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు.

పరీక్షల నిర్వహణకు సహకరించిన అందరికి జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!