ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైలు లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఫై సర్వత్ర ఆసక్తి నెలకొంది.ఇదే లిక్కర్ కేసులో ఏడాదిన్నర క్రితం జైలు కు వెళ్లిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కు శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరి చేసింది.
ఈ నేపథ్యంలో తమ నేతకూ బెయిల్ రాబోతుందంటూ గులాబీ శ్రేణులు సంబర పడుతున్నారు. బెయిల్ కోసం కవిత ఇప్పటికే సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. ఆమె బెయిల్ పిటిషన్ ను విచారించడానికి సుప్రీం కోర్టు సైతం అగీకరించింది. సోమవారం ఆమె బెయిల్ పిటిషన్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మనీష్ సిసోడియా కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం ధర్మాసనం కవిత కు సైతం బెయిల్ ఇచ్చే అవకాశం వుందని గులాబీ శ్రేణులు ఆశాభావం తో ఉన్నారు. ఈ మేరకు కేటీఆర్ సైతం అదే భరోసా వ్యక్తం చేసారు. మార్చ్ 15 ఈడీ అధికారులు కవిత ను హైదారాబాద్ లో అరెస్టు చేసి తీహార్ జైలు కు తరలించారు.
ఆతర్వాత సీబీఐ సైతం అరెస్టు చేసింది. ఆమె ఈపాటికే రెండు సార్లు అస్వస్ధ కు గురయ్యారు. దాదాపు 11 కిలోల బరువు తగ్గిందని గులాబీ నేతలు పలు మార్లు ఆందోళన వ్యక్తం చేసారు. అనారోగ్య సమస్యలను సైతం ఆమె తరుపు న్యాయ వాదులు బెయిల్ పిటిషన్ లో ప్రస్తావించే అవకాశం ఉంది.
నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ గా ఉన్న ఆమె అసెంబ్లీ ఎన్నికల తరవాత జిల్లాకు రాలేక పోయారు.