పోలింగ్ బూత్ లో ఓటింగ్ పక్రియ ను నేరుగా పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మాయం అయి నట్లు సమాచారం.
ఈ వ్యవహారం ఫై పోలీసులకు పిర్యాదు చేయడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు. నగరంలోని పాత నాగారం అలాగే ఇంద్రపూర్ ల లో ప్రభుత్వ పాఠశాలలో లోకసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు.
సిబ్బంది సైతం కేటాయించారు. వారు ఆయా కేంద్రాలకు వెళ్లారు.ఈ కేంద్రాల్లో పోలింగ్ పర్యవేక్షించడానికి సీసీ కెమెరా లు ఏర్పాటు చేసారు. కానీ గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్ళి నట్లు సిబ్బంది గుర్తించారు.
ఈ విషయం ను పోలింగ్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారని తెల్సింది.