సీఎం అయ్యాక మొదటి సారి జిల్లాకు వచ్చిన రేవంత్ సభ ను సక్సెస్ చేయలేక చేతులెత్తిసిన అపఖ్యాతి మూటగట్టుకున్న డీసీసీ అధ్యక్షుడు మానాల ఎన్నికల నిర్వహణలో నూ అదే విమర్శలు ఎదురుకుంటున్నారు. లోకసభ ఎన్నికల పోలింగ్ కు ఇంకా రెండే రోజుల గడువే ఉన్న నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తీరు ఫై సీనియర్ నేతలు రగిలి పోతున్నారు.
ఎన్నికల వేల అన్నీ నియోజకవర్గాల నేతలను కలుపుకొని పనిచేయాల్సిన ఆయన ఒకరిద్దరు చుట్టే తీరుతుండడం ఫై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. లోకసభ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల్ జిల్లాకు చెందిన నేత కావడంతో జిల్లాలోని అయిదు సెగ్మెంట్ లలో ఎవరు ఎలాంటి నేతలో ఆయన నిర్దారించుకోలేక పోతున్నారు.
ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను ఎవ్వరూ చేరదీయడం లేదు. కేవలం కొత్తగా చేరుతున్న నేతలనే నెత్తిన పెట్టుకొని పనిచేస్తుండడంతో పాత నేతలు రగిలి పోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉన్న నేతగా డీసీసీ అధ్యక్షుడు మానాల ఒక్కరిద్దరు నేతల వద్దే రోజంతా పడిగాపులు కాస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
బోధన్ నిజామాబాద్ సెగ్మెంట్ లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యే లుగా ఉన్నారు. దీనితో ఆ రెండు సెగ్మెంట్ లలో లోకసభ ఎన్నికల ప్రచారం పక్కాగా సాగుతుంది. క్షేత్ర స్థాయిలో సీనియర్ క్యాడరే క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రెండో సారి నగరంలో ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చారు.
పార్క్ వద్ద కార్నర్ మీటింగ్ కు ఈ రెండు సెగ్మెంట్ ల నుంచే భారీఎత్తున జనసమీకరణ చేయడం వల్లే ఆ సీఎం సభ నిండుగా కనిపించింది. అసలు నగరం లో జనసమీకరణ విషయంలో ఎవ్వరు పట్టించుకోలేదు. వారితో సమన్వయము చేసే నాధుడే లేకుండే.
అభ్యర్థి జీవన్ రెడ్డి సమన్వయ బాధ్యతలు మానాల మోహన్ రెడ్డి కే అప్పగించినా ఆయన మాత్రం ఎవ్వరికి అందుబాటులో ఉండకుండా ఒకరిద్దరు నేతల వెంట ప్రచారానికి వెళ్లి చేతులు దులుపు కుంటున్నారు.కలెక్టరేట్ లో సీఎం సభ వైఫల్యాలనుంచి జిల్లా కాంగ్రెస్ కనీస గుణపాఠం నేర్చుకోలేక పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మెల్యే లు ప్రాతినిధ్యం లేని సెగ్మెంట్ లలో సీనియర్ నేతల మధ్య కనీస సమన్వయం లేదు.ఎవరికీ వారే పెత్తనం సాగిస్తున్నారు. కొత్తగా వచ్చిన నేతలకే ప్రాధాన్యత ఇస్తుండడం సీనియర్ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు
