HomeCinemaఇందూరు లోనూ ఐటి వణుకు ......దిల్ రాజు సన్నిహితుల మీద డేగ కన్ను ...........ఆర్థిక లావాదేవీలు...

ఇందూరు లోనూ ఐటి వణుకు ……దిల్ రాజు సన్నిహితుల మీద డేగ కన్ను ………..ఆర్థిక లావాదేవీలు న్న వారికి కోసం వాకబు ?

చిత్ర పరిశ్రమ ను కుదిపేసిన ఆదాయ పన్ను శాఖ సోదాలు శుక్ర వారం తో ముగిసాయి. సోదాల వణుకు ఇందూరు ప్రముఖ ల్లోనూ మొదలయ్యింది.

ఆదాయ పన్ను శాఖ ఉచ్చు ఇంకా ఎవరెవరికి బిగుసుకుంటుందో ననే చర్చ ఆయన సన్నిహితుల్లో ఉంది. నిజామాబాద్ నగరానికి చెందిన బడా వ్యాపారులకు రాజు తో చాల కాలంగా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి.

నాలుగు రోజుల పాటు ఆదాయపన్ను అధికారులు రాజు కుటుంబ సభ్యులు వారి బంధువుల ఇండ్లు ఆఫీస్ ల్లో క్షుణ్ణంగా సోదాలు జరిపారు. అనేకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యలోనే తమ ఆర్థిక డొంకలు కదులుతాయనే బెంగ బడా వ్యాపారుల్లో మొదలైంది.

మార్చి నెల టార్గెట్ లకోసం ఆదాయ పన్ను శాఖ అధికారులు వసూళ్ల వేట జరపడం ఆనవాయితీ గా వస్తుంది.అందుకే దిల్ రాజు తాలూకు సోదాల వణుకు ఇక్కడి వ్యాపారుల్లో ను ఉంది. ముఖ్యంగా సినిమా థియేటర్ యజమాని చిట్ పండ్ నిర్వాహుకుడు రాజు ఆర్థిక లావాదేవీలున్నాయనేది అందరికి తెల్సిందే.

తాజా పరిణామాలతో సదురు వ్యాపారుల మీద స్థానిక ఆదాయ పన్ను అధికారులు ఫోకస్ పెట్టె అవకాశం ఉంది. నిర్మాత దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్, ఇతర కుటుంబ సభ్యుల ఇండ్ల లలో నాలుగు రోజుల పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.

దిల్ రాజు ది నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామం. ఆయన స్వగ్రామం తరుచు వచ్చి వెళ్లారు. ఆయన తో బడా వ్యాపారాలతో సన్నహిత సంబంధాలున్నాయి. అందులోనూ సంక్రాంతి కి వస్తున్నాం సినిమా ఫ్రీ రిలీజ్ పంక్షన్ నిజామాబాద్ నగరంలో ఘనంగా చేశారు.

ఐటి అధికారులు . దిల్ రాజు నివాసం సహా అనేక కీలక ప్రదేశాల్లో అధికారులు సోదాలు చేసారు . . ఐటీ అధికారులు ఈ దాడులలో పలు ఆర్థిక పత్రాలు, లావాదేవీల వివరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ చర్యలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చిత్ర పరిశ్రమలో ఈ పరిణామం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments