కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడిన చందంగా సుదీర్ఘ కసరత్తులు చేసి చివరికి వరస ఓటమిల వెక్కిరిస్తున్న జీవన్ రెడ్డి నే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. తటస్థులను రంగంలోకి దించాలనే సునిల్ కనుగోలు యత్నాలు ఫలించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన చేదు పలితాలతో కాంగ్రెస్ పార్టీ ఇంకా గుణపాఠం నేర్చుకోలేక పోతుంది.బీజేపీ బిఆర్ యస్ లు బీసీ వర్గాలకు చెందిన బలమైన నేతలను అభ్యర్థులుగా నిలిపింది.
అందుకే అధికారంలో ఉన్న కాంగ్రెస్ నిజమాబాద్ లోకసభ అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందని అంచనా వేశారు. ఈసారి కంచుకోట లాంటి నిజామాబాద్ స్థానం కోసం పట్టుదలతో ఉందనే ప్రచారం జరిగింది.ఆ మేరకు బలమైన అభ్యర్థి కోసం ఎడతెగని కసరత్తులు చేసింది. పార్టీలో ఆ స్థాయి నేతలెవ్వరూ లేకపోవడంతో తటస్థులను తెరమీదికి తెచ్చింది. సామజిక ఆర్థిక నేపథ్యాలే ప్రామాణికంగా కసరత్తులు జరిగాయి. ఇందులో భాగంగానే దిల్ రాజు తో పాటు ప్రముఖ వైద్యులను సంప్రదించారు.
కానీ దిల్ రాజు సున్నితంగా తిరస్కరించారు.కానీ అన్న నర్సింహా రెడ్డి కి టికెట్ ఇవ్వాలని కోరాడు. మొత్తానికి కొత్త వారికే ఎంపీ టికెట్ దక్కబోతుందనే ప్రచారం విసృతంగా సాగింది.కానీ పీసీసీ, డీసీసీ లు మూకుమ్మడిగా సిఫారస్ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయంలో అధిష్టానం మొదట ఆసక్తి చూపడంలేదు . కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆయన వైపు గట్టిగా మొగ్గుచూపుతున్నారు. పెద్దాయన వుంటే నే అందరూ కలిసి కట్టుగా పనిచేస్తారనే చెప్తూ వచ్చారు అందుకే రెండో జాబితాలో నిజామాబాద్ లోకసభ స్థానం ను పెండింగ్ లో పెట్టేసారు.
దీనితో సునీల్ కనుగోలు బృందం మరోసారి రంగంలోకి దిగింది ఆర్థిక సామజిక సమీకరణలే ప్రాతిపదికగా తటస్థులను రంగంలోకి దించే ఆలోచన చేసాయి .ఇందుకోసం ఓ ప్లాష్ సర్వే ను చేప్పట్టారు .కానీ కొత్త వారికి టికెట్ ఇస్తే సీనియర్ నేతలు ఏ మేరకు కలసి కట్టుగా పనిచేస్తారనేది అనుమానం వ్యక్తంఅయింది . అందుకే ఈసారి కొత్త వారితో ప్రయోగం వద్దని రేవంత్ ఢిల్లీ పెద్దలకు సముదాయించారని సమాచారం .
అయితే ఓడిన నేతలకు టికెట్ ఇస్తే బాల్కొండ నుంచి ఓడిపోయిన సునీల్ రెడ్డి ని సైతం పరిగణలోకి తీసుకోవాలని ఒకరిద్దరు నేతలు రేవంత్ ను కోరినట్లు సమాచారం. చివరికి జీవన్ రెడ్డి కె టికెట్ ఖరారు చేశారు. వరసగా రెండు సార్లు ఎంపీ కరీం నగర్ స్థానం నుంచి పోటీ చేశారు. 2006 ,2008 లో అదికూడా కెసిఆర్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇప్పటిదాకా 11 సార్లు పోటీచేసి ఆరు సార్లు గెలిచాడు. టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలయ్యింది.
