ప్రైవేట్ రంగంలో నిరుద్యోగులకు తిపికబురు నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 20న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సిరిమల్ల శ్రీనివాస్ తెలిపారు.
ఈ ఉద్యోగ మేళాకు (ముతూట్ ఫైనాన్స్)నియామకాలు చేపడుతుందని అన్నారు. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ రేలషన్ షిప్ ఎగ్జిక్యూటివ్, ఇంటర్న్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. ఇంటర్మీడియేట్, ఏదైనా డిగ్రీ, (బి.బి.ఏ), (యం.బి.ఏ) విద్యాహర్హత ఉండాలని, 18 సం”నుండి 30 సం” వరకు వయోపరిమితి ఉండాలని అన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం , శివాజీ నగర్, నిజామాబాదులో ఉద్యోగ మేళ ఉదయం 10.30గం’ల నుండి 03.30గం’ల మధ్యాహ్నం లోపల తేదీ:20-06-2024 నాడు పాల్గొనగలరని తెలిపారు. ఇతర వివరాలకు 9581768413, 9948748428, 6305743423, 9959456793 ఫోన్ ద్వారా సంప్రదిం చాలన్నారు.
అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయో డేటా, ఆదరికార్డు, ఎస్సెస్సీ మెవెూ, ఫోటో తీసుకురావాలని జిల్లా ఉపాధి అధికారి సిరిమల్ల శ్రీనివాస్ తెలిపారు.