Monday, December 8, 2025
HomeCRIMEరేషన్ బియ్యంతో వెళ్తున్నా లారీ బోల్తా..డ్రైవరు కు లైసెన్స్ లేకపోవడం గమనార్హం..

రేషన్ బియ్యంతో వెళ్తున్నా లారీ బోల్తా..డ్రైవరు కు లైసెన్స్ లేకపోవడం గమనార్హం..

రేషన్ బియ్యంతో వెళ్తున్నా లారీ బోల్తా కొట్టిన ఘటన నసుర్లాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లావణ్య తెలిపిన వివరాల ప్రకారం.

మంగళవారం అధిక లోడ్ తో బాన్సువాడ నుంచి బోధన్ కు వెళ్తున్నా రేషన్ బియ్యం లారీ నసుర్లాబాద్ గండి వద్ద మలుపు దగ్గర అదుపుతప్పి లారీ బోల్తా పడింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

లారి నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ సమయములో రోడ్డు పై ఎవ్వరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తపిందని తెలిపారు.పోలీస్ లు డ్రైవర్ ను వివరాలూ తెలుసుకోగ డ్రైవర్ కు (25) లైసెన్స్ లేకపోవడం గమనార్హం.

డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లావణ్య వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!