అర్బన్ లో ఆధిపత్యం పోరు తప్పదా ? అర్బన్ లో మరింత క్రియాశీలకం కాబోతున్న షబ్బీర్ …….అర్బన్ లోనే ప్రొటొకాల్ ఎన్ రోల్ అయిన మహేష్ …….నామినేటెడ్ పోస్టు ల మీద కన్నేసిన సుదర్శన్ రెడ్డి .దిక్కు తోచని ద్వితీయ శ్రేణి నేతలు ……అందరి మెప్పించలేక వ్యయ ప్రయాసాలు .
అర్బన్ అధికార పార్టీలో దిగ్గజ నేతల మధ్య ఆధిపత్య పోరు తప్పేలా లేదు. అందరూ కీలక నేతలే కావడంతో ఎవరి వైపు మొగ్గు చూపాలో ద్వితీయ శ్రేణి నేతలకు దిక్కుతోచడం లేదు.
ముగ్గురు నేతలను మెప్పించడానికి వ్యయప్రయాసలు పడుతున్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ అర్బన్ అధికార పార్టీలో మరింత క్రియాశీలకం కాబోతున్నారు.
పార్టీ తోపాటు పాలన వ్యవహారాల్లోనూ తన ఆధిపత్యం సాగేలా కార్యాచరణ కు సిద్ధం అవుతున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక అర్బన్ వ్యవహారాలకు అంటీముట్టనట్లుగా వుంటూ వచ్చిన షబ్బీర్ అలీ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ ఆధిక్యం వచ్చిన నేపథ్యంలో షబ్బీర్ అర్బన్ వ్యవహారాల మీద సీరియస్ గా దృష్టి పెట్టె పనిలో ఉన్నారు.
మధు యాష్కీ నివాసంలోనే తన క్యాంప్ కార్యాలయం ను బుధవారం నుంచి అందుబాటులోకి తెస్తున్నారు. ఇదేరోజు ప్రభుత్వ సలహాదారు హోదా లో ఆయన మొదటి సారిగా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.
తనయుడు ఇలియాస్ కు అర్బన్ బాధ్యతలు అప్పగించబోతున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.రాబోయే రోజుల్లో నిజామాబాద్ నగరంలోనే మకాం పెట్టేలా కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు.
నిజామాబాద్ నగరంలోని బైపాస్ శివారు లో సొంత ఇల్లు నిర్మించుకునేలా అత్యంత ఖరీదైన స్థలం ను కొనుగోలు చేసారు. దాదాపు వెయ్యిగజాల స్థలం ఇంటి నిర్మాణం కోసం తనయుడు ఇలియాస్ పేరుమీద కొనుగోలు చేసారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక షబ్బీర్ కామారెడ్డి సెగ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కానీ లోకసభ ఎన్నికల్లో అర్బన్ లో ముస్లిం వోట్లు గంప గుత్తగా కాంగ్రెస్ వైపు పడ్డాయి.
ఇదే ఫార్ములా అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అవుతుందనే షబ్బీర్ అర్బన్ మీద ఆశలు మొదలయ్యాయి. కానీ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కూడా అర్బన్ సెగ్మెంట్ లోనే పాగా వేసే ఆలోచనలో ఉన్నారు. పీసీసీ చీఫ్ రేసులో ఉన్న ఆయన ఇప్పుడు వ్యూహాత్మక మౌనం తో ఉన్నారు.
అదను చూసు కొని దూకుడు పెంచే ఎత్తుగడలో మహేష్ ఉన్నారు. ఎమ్మెల్సీ అయ్యాక ఆయన ప్రోటోకాల్ ను అర్బన్ లోనే నమోదు చేయించారు. కార్పొరేషన్ లోనూ ఎక్స్ ఆఫీషాయో సభ్యుడి నమోదు అయ్యారు. క్రమం తప్పకుండ వస్తున్నారు.
షబ్బీర్ ను కామారెడ్డి సెగ్మెంట్ బాధ్యతలు చేసుకొనేలా సీఎం రేవంత్ ను ఒత్తిడి చేసే పనిలో మహేష్ గౌడ్ ఉన్నారు .మరో వైపు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సైతం అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు.పాలన, పార్టీ వ్యవహారాల్లోతన ముద్ర వుండడానికి తహ తహ లాడుతున్నారు.
ఆయన కేవలం ఎమ్మెల్యే హోదాలో నే ఉన్నా సరే పాలన పార్టీ వ్యవహారాల్లో ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది. రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టుల్లో తన పట్టు చూపెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.