లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలు లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తూ సోమవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలంటూ కవిత గత నాలుగు రోజుల క్రితమే పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే ఆమె కుమారుడికి ఏడు పరీక్షలు పూర్తి అయ్యాయని, బెయిల్ ఇవ్వవద్దని ఈడీ వాదన చేసింది కవిత బయటకు వస్తే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమూరు చేసే ప్రమాదం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది. ఈ క్రమంలో 4న ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తీర్పు రిజర్వ్ చేసి కేసు సోమవారం కు వాయిదా వేశారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా.
ఇదిలా ఉండగా కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఇవాళ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో.. రేపు(మంగళవారం) మళ్లీ తీహార్ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరుస్తారు. మరోవైపు.. కవిత సాధారణ బెయిల్ పిటిషన్‌పై మాత్రం ఈ నెల 20న రౌస్ అవెన్యూ కోర్టు లో విచారణ జరగనుంది.