ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్న యువకుడు దారుణ హత్య కు గురయ్యాడు. హత్య చేసిన విషయం నిందితులు ఇన్‌స్టాగ్రామ్‌లో దుండగులు రీల్స్ చేసి పోస్టు చేసారు ఈ అమానుష ఘటన సైబారాబాద్ కమిషనరేట్ పరిధి లోని బాచుపల్లిలో జరిగింది. నిందితులను పోలీసులు ఈపాటికే గుర్తించారు.
ప్రగతినగర్ చెరవు కట్ట వద్ద కకు తేజస్ అనే యువకుడిని రప్పించి ఇద్దరు యువకులు కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి, బండరాయితో తలపై కొట్టారు దీనితో తేజస్ అక్కడిక్కడే మృతి చెందాడు . మృతుడు తేజస్ , గతేడాది దసర రోజున జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు .తేజస్ రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు.
ఇదే తేజస్ హత్యకు కారణమఅయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు హత్య అనంతరం నిందితులు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేశాడు. తేజస్‌ను తామే చంపేశామంటూ సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేశారు. ఇది సోషియల్ మీడియా వేదికల్లో హల్చల్ అవుతుంది. ఉదయమే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.మృత దేహం ను ఆసుపత్రికి తరలించారు.