నిజామాబాద్ జిల్లా బోధన్ లో విషాదం. కారులో ఊపిరాడక ఆరేళ్ల బాలుడు రాఘవ మృతి
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసి పేటలో విషాదం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం పట్టణంలో రాఘవ అనే ఆరేళ్ల బాలుడు కనపడకుండా పోయాడు. రోడ్డు పక్కన పార్కు చేసిన కారులో ఎక్కిన బాలుడు ఊపిరాడక మృతి చెందాడు.
నాలుగు రోజుల క్రితం బాలుడు ఎక్కిన కారును యజమాని గమనించక లాక్ చేశాడు. బాలుడు తప్పి పోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు లో నుంచి దుర్వాసన రావడం తో తాళం తీసి చూసే సరికి బాలుడు శవమై కనిపించాడు. బోధన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.