రోడ్డు ప్రమాద కేసులో నిందితుడిగా ఉన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్‌ను సోమవారం తెల్లవారు జామున పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని మెజిస్టేట్ ముందు హాజరు పరిచారు. ఈనెల 22 వరుకు రిమాండ్ విధించారు. దుబాయి నుంచి వచ్చిన రహెల్ ను సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ దగ్గర జరిగిన ప్రమాదం ఘటనలో నిందితుడిగా ఉన్న పోలీసుల సహకారంతో అదే రోజు రాత్రి రహేల్ దుబాయ్ పారిపోయాడు. దీంతో ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అతను హైకోర్టు ను ఆశ్రయించారు. అతను లొంగిపోవడానికి గడువు కూడా ఇచ్చింది.
ప్రజా భవన్ దగ్గర జరిగిన ప్రమాదంలో రహేల్ ను తప్పించేందుకు తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్లు చూపించారు నిందితులు. కానీ.. అసలు నిందితుడు రహేల్ గా పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ పుటేజీ చూసి అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.ఈ ఘటనలో నిందితులకు సహకరించి ఇద్దరు సీఐ ల మీద కేసులు నమోదు అయ్యాయి.
//// పాత కేసు కూడా మెడకు చుట్టే యత్నం ////// /
ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాద కేసులో అరెస్టు అయిన రహేల్ కు మరో కేసు ఉచ్చు బిగించే యోచనలో ఉన్నారు.జూబ్లీహిల్స్‌లో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కేసును సైతం డీసీపీ విజయ్ కుమార్ స్వయంగా తిరగదోడారు . ఈ ప్రమాదం సమయంలో షకీల్ కొడుకే రహేల్ కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. . జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో 2022న మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చిన మహీంద్రా థార్ వాహనం రాత్రి ఎనిమిది గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. ముగ్గురు మహిళలకు గాయాలు కాగా రెండు నెలల బాలుడు దుర్మరణం చెందాడు. కారులోని యువకులు పారిపోయినప్పటికీ వాహనంపై అప్పటి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో షకీల్ వాహనంగా నిర్దారణ కు వచ్చారు .
ఈ ఘటన లో తన కుమారుడు లేడని షకీల్ స్పష్టం చేసారు . మరోవైపు అఫ్రాన్ అనే మరో యువకుడు తానే కారు నడిపినట్లు అంగీకరించి లొంగిపోయాడు. స్టీరింగ్‌పై వేలిముద్రలు అఫ్రాన్‌వేనని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. బాధితుల వాంగ్మూలాల సేకరణ సహా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మాజ్ అనే మరో యువకుడితో పాటు కారులో రాహిల్ ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు మలుపు తిరిగింది.
తాజాగా దర్యాప్తులో ఆరోజు కారు నడిపింది రహేల్ అని పోలీసులు గుర్తించారు. గతంలో గాయపడ్డన బాధితుల వాగ్మూలం కూడా మహారాష్ట్ర వెళ్ళి నమోదు చేసారు. ఈకేసు ఫైల్ కూడా ఓ అధికారి చాల రోజులు మాయం చేసారు. సోమవారం అరెస్టు అయిన రహెల్ మీద ఈ కేసు నమోదు చేసే ఆలోచనలో పోలీసులున్నారు