నిజామాబాద్ జిల్లాలో సాలూర క్యాంపులో విషాదం.ఈత కోసం వెళ్లి చెరువులో ఇద్దరు విద్యార్థులు గల్లంతు. విద్యార్థుల మృతదేహాల వెలికి తీత.నిజామాబాద్ జిల్లా సాలుర మండలంలోని సాలూర క్యాంపులో విషాదం చోటుచేసుకుంది.
కుమ్మనపల్లి గ్రామంలోని చెరువులో ఈత కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. శనివారం సాయంత్రం వాకింగ్ చేస్తూ గోరంట్ల మనోజ్ కుమార్ (19), మనోజ్ రెడ్డి( 23)లు చెరువు వద్దకు వెళ్లారు.
చెరువులో ఈత కోసం దిగిన ఇద్దరు గల్లంతయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. చెరువు వద్ద చెప్పులను గుర్తించారు. జాలర్ల సాయంతో చెరువులో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
