HomeCRIMEమైనర్ బాలికను గర్భవతి చేసిన మాయలోడు

మైనర్ బాలికను గర్భవతి చేసిన మాయలోడు

మైనర్ బాలికను గర్భవతి చేసిన మాయలోడు

-ఆర్మూర్ మండలం చేపూర్ లో వెలుగు చూసిన ఘటన

  • పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు
  • ఫోక్సో చట్టం కింద కేసు నమోదు

( జానా రమేష్ ) మాయమాటలు చెప్పి అమాయకమైన మైనర్ బాలికను గర్భవతిని చేసిన అమానవీయ ఘటన ఆర్మూర్ మండలం చేపూర్ లో చోటుచేసుకుంది. అత్యాచారం చేయడమే కాకుండా ఆపై ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిన ఘటన డివిజన్లో కలకలం రేపుతుంది. మరిన్ని వివరాలకు వెళ్తే… చీపురు గ్రామానికి మైనర్ 9వ తరగతి చదువుతుంది. బాలికపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన సంపత్ అనే యువకుడు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజువారి కూలి పనులు చేసుకునే పేద కుటుంబం నాకు చెందిన మైనర్ బాలిక ఒకసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో విషయం బయటకు పొక్కింది.

ఆర్మూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేపించగా తమ కుమార్తె గర్భవతి అని తేలడంతో ఆందోళన చెందిన బాధితురాలు తల్లిదండ్రులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిసింది. కాగా పోలీసులు మాత్రం నిందితుడి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments