HomeTelanganaNizamabadబీఆర్‌ఎస్‌ నేతల పదేళ్ల అవినీతిని కవిత బయటపెడుతున్నారు: డీసీసీ నాగేశ్‌రెడ్డి...

బీఆర్‌ఎస్‌ నేతల పదేళ్ల అవినీతిని కవిత బయటపెడుతున్నారు: డీసీసీ నాగేశ్‌రెడ్డి…

బీఆర్‌ఎస్‌ హయాంలో పదేళ్లపాటు జరిగిన అవినీతి, అక్రమాలను కవిత బయటపెడుతున్నారని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగేశ్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బిడ్డ కల్వకుంట్ల కవితనే ఆ పార్టీ ఎమ్మెల్యేలపై దుమ్మెత్తిపోస్తున్నారని అన్నారు.

నిజామాబాద్‌లోని కాంగ్రెస్‌ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని నాగేశ్‌రెడ్డి తెలిపారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వంటి హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఫామ్‌హౌస్‌లో పడుకుని ప్రజల బాధలు ఎలా తెలుస్తాయికేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కూర్చొని ప్రజల సమస్యలను పట్టించుకోలేదని నాగేశ్‌రెడ్డి విమర్శించారు.

ప్రజల మధ్య ఉండి వారి కష్టాలను తెలుసుకున్నప్పుడే సమస్యలు అర్థమవుతాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.

బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అవుతున్నా ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో చెప్పాలని ప్రశ్నించారు. నిజామాబాద్‌కు ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఎన్ని ప్రాజెక్టులు, ఉద్యోగావకాశాలు తీసుకొచ్చారో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు కేంద్ర ప్రభుత్వం, స్థానిక ఎంపీ తమ పనితీరుపై సమాధానం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments